IMPERIENCE           DRKCV.ORG           SSS           

 
 

Daily Inspiration


What is new


సంపాదకీయము - 20.1 - 141 L.E. (2013)

  

సమర్ధ గురువు పూజ్య శ్రీ లాలాజీ మహరాజ్ గారి శకములో 141 సంవత్సరపు శుభాకాంక్షలు

బసంత్ పంచమి ఉత్సవాలలో వొక స్పష్టమైన భావన మనందరికీ కలిగేది ఏమిటంటే కృతజ్ఞతా భావన మనకు నిత్యం ఆ ప్రాణస్య ప్రాణాః యొక్క తోడ్పాటు లభించేలా చేసి మన పూజ్య బాబుజీ మహరాజ్ గారిని సంపూర్ణముగా తీర్చిదిద్ది వొక విశిష్ట మూర్తిగా మలచిన ఈ మహనీయునికి మనము సర్వదా ఋణపడి వున్నాము.

మరి ఈ ఋణము తీర్చగలమా అంటే యిది తీర్చలేని ఋణము మనము చేయగలిగనదల్లా ఈ పద్ధతి వలన మనలోని మార్పును తద్వారా యితరులకు ఈ పద్ధతి గురించి చెప్పడమే యే విషయములోకాని పరిష్కారము దాని పై స్ధాయి నుండి వస్తుంది చిన్న పిల్లల మధ్య గొడవలు తల్లిదండ్రులు పరిష్కరిస్తారు అలాగే మనలో వున్న భావొద్వేగాలను అధిగమించాలంటే దానిని అధిగమించే శక్తి మనకు తోడ్పడాలి ఈ తోడ్పడే శక్తియే ప్రాణాహుతి.  ప్రతి జీవిలో తన ప్రస్తుత స్దాయి కన్న పైకి ఎగరాలనే తపన వుంటుంది ఈ తపన భండారాలలో మరింత కనిపిసస్తూ వుంటుంది మనము చేయవలసినదల్లా పవిత్రమైన ప్రాణస్య ప్రాణాః లోబడి వుండడమే ప్రాణాహుతికి వొక ప్రత్యేకత వుంది దాని ప్రభావము దేనిపైన పడినాగాని అది దానిని పూర్తిగా నిర్మళీకరణగావించి మార్పుని తీసుకు వస్తుంది ఈ మార్పు మనలో రాగానే యితరులు చూస్తారు మరియు ప్రేరణ పొందుతారు ఈ మార్పు అందరిలోనూ రావాలని ప్రార్ధన.