IMPERIENCE           DRKCV.ORG           SSS           

 
 

Daily Inspiration


What is new


సంపాదకీయము - 20.3 - 141 L.E. (2013)

  

పుట్టినవెంటనే శంఖచక్రధారియై తండ్రిని నందునింటికి కుంభవర్షములొ కొంపోవమని ఆదేశించి తన దివ్య అవతారమును ఆవిష్కరించిన శ్రీ కృష్ణుని తలచినపుడు కలిగే ఆనందము సర్వుల అనుభవము. బాల్యమంతా వినోదంగానే క్రీడలుగా కంసుని అనుచరులను స్త్రీ పురుష లింగ తేడాలేక మట్టికరిపించి సాధుజనులకు స్వాంతన కలిపిస్తూనే తను శిష్ట రక్షకుడనీ దుష్టశిక్షకుడనీ తెలియచేసుకొన్నాడు. భక్త కోటికి నిరంతరమూ ఆటలతో పాటలతోటీ ఆనందపరుస్తూ పూర్వ అవతారములో చేసిన వాగ్దానములను చెల్లించు కొన్నాడు. గోకులంలో తన కర్తవ్యములు ముగియగానే మధురకు ప్రస్థానముగావించి తన జనకులకు దాస్యవిముక్తి గావిస్తూ మార్గములో తనను నమ్మిన కుబ్జకు సౌందర్యము ప్రసాదిస్తునే కువలయా పీడనం, చానూర ముష్ఠికులను సంహరించి కంసుని గుండెలో గుబులు పుట్టించి మేనమామయని తడబడక దుష్ట శిక్షణ మనే తన కర్తవ్యమును నిర్వర్తించాడు. ముందు రక్షణ తరువాత శిక్షణయనేది అవతార పురుషులలక్షణము. అదే తీరున మన బాబూజీముందు తన రక్షణ యనే కర్తవ్యము నిర్వర్తించి శిక్షణా కర్తవ్యాన్ముఖుడైనట్లు  ఈ మధ్యకాలమున జరుగుతున్న సంఘటనలు తెలుపుచున్నది. పాఠకులు గురువు గారి 1960 లో తెలిపిన సందేశమును శ్రద్దగా చదివి మననంచేయమని మనవి చేసుకొంటూ

శ్రీకృష్ణాష్టమి.                                                                                             భవదీయుడు.

28-8-2013                                                                                             కే.సి.నారాయణ.