IMPERIENCE           DRKCV.ORG           SSS           

 
 

Daily Inspiration


What is new


సంపాదకీయము - 21.3 - 142 L.E. (2014)

  

శ్రీ కృష్ణ పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు. జగదానందకారకుడు. ఆనందకారకత్వ భగవద్విలాస చైతన్యము. మన గురువు పూజ్య బాబూజీ మనకుపదేసించిన క్షాళన పద్దతిలో, గురువుగారిని ఆనంద సాగరముగా తలంచి మనలోని మాలిన్యాలు తొలగి పోవుచున్నట్లు భావించుట ముఖ్యమయినది. యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాంతర్ శుచిః యన్నట్లు శ్రీ రామచంద్రుని తలచి నంతనే మనలను సబాహ్యాతరముగా కప్పి వేసే చైతన్యము సాధకులయనుభవము. నిర్మలీకరణమునకు యింతకంటే విశిష్టమయిన పద్దతి లేదనటంలో ఎట్టి అతిశయోక్తిలేదు. శ్రీ కృష్ణ శ్రీ రామచంద్రుల కభేదమని మన గురువర్యులు పలుచోట్ల మనకు తెలియచెప్పినారు. అయినా కొందరి మనస్సులో ఏదో శంఖ యుంటూనే యుంటున్నది. మనము ఆధ్యాత్మిక విషయాలను అనుభవము ద్వారానే తెలియగలము. అంతవరకు గురువుగారి మాటలను నమ్మి సాధన చేసుకుంటూ పోవాలి. అదే విజ్ఞత. ఈ శ్రీ కృష్ణాష్టమి మనకు ఆనాటి జగద్గురువుకు ఈనాటి మన పాలిటి వరమైన మన జగద్గురువులకూ యున్నఅభేధమనే పరతత్వ జ్ఞానమును ప్రసాదించమని ప్రార్థనతో,

కే.సి.నారాయణ.